News January 14, 2026
KNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న చలి తీవ్రత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత తగ్గుతూ వస్తోంది. బుధవారం ఉదయం వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 13.2℃, జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం 13.3℃, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం 14.3℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 14.5℃గా నమోదయ్యాయి.
Similar News
News February 17, 2026
మెన్‌స్ట్రువల్ కప్ ఎలా ఎంచుకోవాలంటే?

పీరియడ్స్‌లో నాణ్యత లేని ప్యాడ్స్ వాడటం వల్ల దురద, రాషెస్ వస్తాయి. వీటికి బదులు మెన్‌స్ట్రువల్ కప్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సిలికాన్‌తో తయారయ్యే దీన్ని 10-12 గంటల వరకు వాడొచ్చంటున్నారు. నాప్కిన్స్, టాంపూన్స్ కంటే ఎక్కువ బ్లడ్ హోల్డ్ చేస్తుంది. ఒక్కసారి కొంటే పదేళ్ల వరకు వాడొచ్చు. కొనేముందు వయసు, సర్విక్ లెంగ్త్, పీరియడ్ ఫ్లో, ఫ్లెక్సిబిలిటీ, డెలివరీ టైప్ వంటివి దృష్టిలో పెట్టుకోవాలి.
News February 17, 2026
కనులవిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ , అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
News February 17, 2026
తొర్రూరు మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ వీరే..!

తొర్రూరు మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌గా తూనం శ్రవణ్, సోమ రజని ఎన్నికైన విషయం తెలిసిందే. శ్రవణ్ తల్లి గతంలో రెండవ వార్డు కౌన్సిలర్‌గా సేవలందించగా, శ్రావణ్ ప్రస్తుతం అదే వార్డు నుంచి పోటీ చేసి ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన సోమ రజిని డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇరువురిని అదృష్టం డ్రా పద్ధతిలో వరించింది.


