News April 25, 2024

గరివిడిలో ఆవుకు వింత దూడ జననం

image

గుర్ల మండలం గొలగం గ్రామానికి చెందిన కలిశెట్టి మురళి ఆవు ప్రసవానికి ఇబ్బంది పడుతుండటంతో, బుధవారం గరివిడి స్థానిక పశువైద్య కళాశాలకు తీసుకొని వెళ్లాడు. కళాశాలలోని సహా ఆచార్యులు ఆవును పరీక్షించి, ఆపరేషన్ చేశారు. ఆడ దూడ 2 తలలు, 2 తోకలు, 4 వెనక కాళ్లు, 2 ముందర కాళ్లు, 3 నాలుకలతో ఉంది. పుట్టిన వెంటనే మరణించింది. జన్యుపరమైన లోపాలతో అరుదుగా ఇలాంటి దూడలు పుడుతుంటాయని
కళాశాల వైద్యులు తెలిపారు.

Similar News

News December 28, 2025

ఈ ఏడాది 57 పోక్సో కేసులు నమోదు: VZM ఎస్పీ

image

విజయనగరం జిల్లాలో పోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. 2024లో 58 కేసులు నమోదుకాగా.. 2025లో 57 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడంతో నిందితులకు కఠిన శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, 2 కేసుల్లో 25 సంవత్సరాలకు పైగా, 11 కేసుల్లో 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్షలు విధించబడ్డాయని వివరించారు.

News December 28, 2025

VZM: జిల్లాలోని 200 ఎకరాల్లో ఫుడ్ పార్క్‌లు

image

విశాఖ ఆర్థిక రీజియన్‌లో భాగంగా జిల్లాలో ఐదు ఫుడ్ పార్కులు, రెండు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో 200 ఎకరాల్లో ఫుడ్ పార్కులు, భోగాపురంలో ఏరోసిటీ, ఐటీ హబ్‌లకు భూముల గుర్తింపుపై శనివారం సమీక్షించారు. వాటికి భూసేకరణను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.

News December 27, 2025

VZM: ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి

image

2013వ సంవత్సరం బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు సెలెక్షన్ గ్రేడ్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి ఇచ్చి, ఇదే జిల్లాలో సీనియర్ ఎస్పీగా కొనసాగాలని శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతి సందర్భంగా జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది ఎస్పీకు శుభాకాంక్షలు తెలిపారు.