News January 14, 2026

ఖమ్మం: BRS-YCP, కాంగ్రెస్-TDP మిక్స్‌డ్ పాలిటిక్స్

image

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏపీ-తెలంగాణ పార్టీల కలయిక ఆసక్తి రేపుతోంది. ఈ నెల 7న KTR పర్యటనలో BRS జెండాలతో పాటు YCP జెండాలు కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు మంచుకొండ ప్రాజెక్టు వద్ద మంత్రి తుమ్మల సభలో కాంగ్రెస్‌తో పాటు TDP జెండాలు రెపరెపలాడాయి. పొరుగు రాష్ట్రంలో ప్రభావం చూపే పార్టీల మద్దతుదారులు ఇక్కడ స్థానిక పార్టీలతో కలిసి అంటకాగడం ఖమ్మం రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

Similar News

News February 21, 2026

వాయిదా తీర్మానం అంటే తెలుసా?

image

అసెంబ్లీ కానీ శాసనమండలి కానీ అజెండా ప్రకారం ప్రతి రోజు సభ కొనసాగుతుంది. కానీ ప్రాముఖ్యమైన విషయాన్ని చర్చించేందుకు సభ్యులు వాయిదా తీర్మానాన్ని కోరతారు.అప్పుడు స్పీకర్ గానీ ఛైర్మన్ గానీ ప్రస్తుత అజెండాను వాయిదా వేసి తీర్మానానికి అంగీకరిస్తారు. దీనికి మెజారిటీ సభ్యుల అంగీకారం కావాలి. ఏపీ కౌన్సిల్‌లో కల్తీ నెయ్యి, హెరిటేజ్ విషయంపై ప్రతిపక్ష వైసీపీ వాయిదా తీర్మానాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.

News February 21, 2026

ఉగ్రదాడులకు చంచల్‌గూడ జైల్లో పథక రచన

image

TG: దేశంలో ఉగ్రకుట్ర <<19199047>>వ్యవహారంలో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ పేలుళ్లకు పాల్పడాలని చంచల్‌గూడ జైలులో లష్కరే తోయిబా ఉగ్రవాది పథకం రచించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ములాఖత్‌లో భాగంగా తనను కలవడానికి వచ్చిన వారితో జైల్లోనే ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో నగరంలోని ముసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

News February 21, 2026

T20 WC: భారత్‌కు షాక్!

image

సూపర్-8లో రేపు సౌతాఫ్రికాతో మ్యాచుకు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. నిన్న నెట్స్‌లో పేస్ బౌలర్ సిరాజ్ గాయపడినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ బ్యాటింగ్ చేస్తూ కొట్టిన బంతి సిరాజ్ మోకాలికి తగలడంతో నొప్పితో మైదానాన్ని వీడినట్లు తెలిపాయి. సిరాజ్ గాయం తీవ్రతపై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అటు ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్‌లో ఉందంటూ ప్లేయర్ల ఫొటోలను BCCI షేర్ చేసింది.