News January 14, 2026
బంగ్లా ఎన్నికలపై మైనార్టీల్లో భయాందోళనలు

బంగ్లాదేశ్‌లో FEB 12న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో పాల్గొనడంపై మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్యతా మండలి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్‌ను కలిశాయి. భద్రతపై ప్రజల ఆందోళనను తెలియజేశాయి. ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరాయి.
Similar News
News February 19, 2026
మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలో స్మార్ట్ కార్డులు!

TG: ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రతి మహిళకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులను ఇచ్చేందుకు RTC సిద్ధమైంది. వచ్చే నెల నుంచి వీటిని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ బేస్డ్ కార్డులను టికెట్ మెషీన్‌పై ట్యాప్ చేస్తే టికెట్ జనరేట్ అవుతుందని అధికారులు తెలిపారు. తొలుత జిల్లాకొక మండలంలో పైలట్ ప్రాజెక్టుగా కార్డులు జారీ చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని సమాచారం.
News February 19, 2026
ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

<
News February 19, 2026
BREAKING: రాష్ట్రంలో భూకంపం

AP: పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20km దూరంలో, భూమికి 10km లోతులో కేంద్రం ఉన్నట్లు EMSC, NCS ధ్రువీకరించాయి. వినుకొండ, దర్శి ప్రాంతాల్లోనూ ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.


