News January 14, 2026
విజయ్ మాతో పొత్తు పెట్టుకో.. బీజేపీ ఆఫర్

తమిళనాడులో తమతో పొత్తు పెట్టుకోవాలని TVK పార్టీని బీజేపీ ఆహ్వానించింది. వచ్చే ఎన్నికల్లో DMK గెలిచే అవకాశమే లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాల్సిన అవసరం ఉందని BJP నేత అన్నామలై అన్నారు. డీఎంకే వ్యతిరేక పార్టీలన్నీ కలవాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కాగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంతకుముందు TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తేల్చి చెప్పారు.
Similar News
News January 31, 2026
‘జన నాయగన్’ వివాదంపై స్పందించిన విజయ్

‘జన నాయగన్’ వాయిదాపై హీరో, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తన సినిమాపై రాజకీయ ప్రభావం ఉంటుందని ముందే ఊహించానన్నారు. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నిర్మాతల గురించే బాధగా ఉందని, తన కారణంగా వాళ్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. JAN 9న రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీ ఆలస్యంతో వాయిదా పడింది.
News January 31, 2026
పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ₹2.5 లక్షల వరకు ఉచిత వైద్యం: CBN

AP: P4 కింద 500-700 ఫ్యామిలీలను క్లస్టర్‌గా చేస్తే మార్పు వస్తుందని CM చంద్రబాబు సూచించారు. కుప్పంలోని పీ4 బంగారు కుటుంబాలు-మార్గదర్శులతో CM భేటీ అయ్యారు. ‘కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అక్షరాస్యత పెంచాలి. రాష్ట్రంలో త్వరలోనే పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ₹2.5L వరకూ ఉచిత వైద్యం అందిస్తాం’ అని చెప్పారు. కుప్పంలోని 3 మండలాలను దత్తత తీసుకున్న MEIL, ADANI, TVS సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.
News January 31, 2026
కూలీ నుంచి గ్రూప్-2 వరకూ.. ‘విజయ’లక్ష్మి స్ఫూర్తి ప్రయాణం

AP: కష్టాలకు ఎదురొడ్డి నిలబడి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళ విజయలక్ష్మి. నంద్యాల(D) రుద్రవరం(M) యల్లావత్తుల గ్రామానికి చెందిన ఆమె పగలంతా కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయంలో చదువు కొనసాగించారు. పేద కుటుంబ నేపథ్యంతో పాటు ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురి కావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా ఆమె కుంగిపోలేదు. పట్టుదలతో చదివి గ్రూప్-2లో ASOగా ఎంపికయ్యారు.


