News January 14, 2026

‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.

Similar News

News January 25, 2026

GNT: గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ట్రాఫిక్ అప్డేట్

image

@VVIP, AA, A1, A2 పాసులు, రైతులు లోటస్ – కరకట్ట మీదుగా – ఎమ్మెస్సార్ ఆశ్రమం – సీడ్ యాక్సెస్ రోడ్ – ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎడమవైపు నుంచి
@బి1, బి2 పాస్ హోల్డర్స్, రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందుకు వెళ్లి వెస్ట్ బైపాస్ రోడ్డు నుంచి
@ గుంటూరు నుంచి వచ్చు సాధారణ వాహనాలు మురుగన్ హోటల్ సెంటర్ నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లి E8 రోడ్డు అండర్ పాస్ – మందడం గ్రామం – వెలగపూడి గ్రామం మీదుగా వెళ్లాలి.

News January 25, 2026

గుంటూరులో రిపబ్లిక్ డే వేడుకలు రేపు 11:30కి ప్రారంభం: కలెక్టర్

image

పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం జరగనున్న జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం పరిశీలించారు. రేపు 11:30కి రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రస్థాయి వేడుకలకు హాజరు కావాల్సి ఉన్నందున జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో మార్పులు చేయడం జరిగిందని తెలిపారు. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News January 25, 2026

గుంటూరు జిల్లా ప్రజలకి గమనిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ నిర్వహణను సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రద్దు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిమగ్నమై ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే PGRS, రెవెన్యూ క్లీనిక్‌ని రద్దు చేశామని అన్నారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కి వచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు.