News January 14, 2026

పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్‌కు ₹1.80 కోట్ల పరిహారం

image

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్‌లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్‌లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.

Similar News

News February 22, 2026

BELలో మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులు

image

చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)2 మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులను భర్తీ చేయనుంది. CMA/CA(ఇంటర్మీడియట్) అర్హతగల వారు మార్చి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మొదటి ఏడాది నెలకు స్టైపెండ్ రూ.25K, రెండో ఏడాది రూ.27K, మూడో ఏడాది రూ.30K చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News February 22, 2026

రేపు స్టాక్ మార్కెట్లపై వీటి ప్రభావం?

image

US-ఇరాన్ టెన్షన్స్, అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్స్ రద్దు ప్రభావం రేపు దేశీయ స్టాక్ మార్కెట్లపై ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. US సుప్రీంకోర్టు తీర్పు, వెస్ట్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా క్లోజ్ అవడం సానుకూలంగా ఉంది. అయితే ఈనెల 24 నుంచి 15% టారిఫ్స్ అమలు కానున్నట్లు ట్రంప్ ప్రకటించడం, ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ-విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపీ పతనం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి.

News February 22, 2026

SKY టెక్నిక్ ప్రమాదకరం: సంజయ్ మంజ్రేకర్

image

T20WC: బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అనుసరిస్తున్న వ్యూహం ప్రమాదకరమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించారు. USAతో మ్యాచ్‌లో వికెట్లు కాపాడేందుకు SKY ఆచితూచి ఆడటం కలిసొచ్చినా అన్ని మ్యాచ్‌ల్లో అదే ఫాలో కావడం సరికాదన్నారు. 200+ టార్గెట్ స్కోర్ చేసే సమర్థత జట్టుకు ఉందని.. లోయర్ ఆర్డర్‌లోని హిట్టర్లకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. దూకుడుగా ఆడి భారీ స్కోర్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.