News January 14, 2026
మెట్‌పల్లి: వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రఘు

వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మెట్‌పల్లికి చెందిన డాక్టర్ చిట్నేని రఘు నియామకం అయినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుమండ్ల మహేష్ బుధవారం తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడ అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా పలువురు అతనిని అభినందించారు.
Similar News
News January 20, 2026
సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా: హరీశ్ రావు

TG: సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘విచారణకు పిలిచి గంట ప్రశ్నలు అడగడం.. కాసేపు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లడం చేశారు. కోల్ మైన్ విషయంలో రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. ఈ అంశం డైవర్ట్ చేయడానికే డ్రామా ఆడుతున్నారు. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఎం రేవంత్ భాష వింటే రోత పుడుతోంది’ అని ఆయన అన్నారు.
News January 20, 2026
నెల్లూరు జిల్లాలో సరికొత్తగా అంగన్వాడీలు

నెల్లూరు జిల్లాలో 2,942 అంగన్వాడీ కేంద్రాలకు 1,037 సొంత భవనాల్లో మిగిలినవి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 401 కేంద్రాలను సక్ష అంగన్వాడీలకు కేంద్రం అభివృద్ధి చేస్తోంది. రూ.1.83కోట్లు ఖర్చు చేసి అంగన్వాడీల్లో కూరగాయలు పండించడం, ఇంకుడు గుంతలు నిర్మించడం, టీవీ, బొమ్మలు, ఇతరత్రా మౌలిక వసతులు కల్పిస్తోంది. మరో 205 కేంద్రాల అభివృద్ధికి గతేడాది ప్రతిపాదనలు పంపారు. వీటిని సైతం త్వరలో అభివృద్ధి చేస్తారు.
News January 20, 2026
‘ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి’

ప్రజాసేవలో నాణ్యత పెరగాలని, జిల్లా అభివృద్ధికి శాఖల సమన్వయం కీలకమని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గ్రీవెన్స్ దరఖాస్తులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీపై బాధ్యతతో స్పందించి, వారిలో నమ్మకం కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.


