News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో ‘బ్లాక్ చైన్’ సిస్టం

image

భూమి మీది.. కానీ రికార్డుల్లో ఇంకొకరిది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి మాయాజాలం చెల్లదు. ఇక్కడ ప్రతి అంగుళం ‘బ్లాక్ చైన్’ భద్రతలో ఉంటుంది. ప్రభుత్వం “హైడ్రా-లెడ్జర్” వ్యవస్థను డిజైన్ చేసింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయొచ్చు.. కానీ ఇక్కడ ‘బ్లాక్ చైన్’ వాడటం వల్ల ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని అధికారులు Way2Newsకు వివరించారు.

Similar News

News February 4, 2026

NRPT: ‘టీజీ-ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు’

image

టీజీ-ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు నిబంధనల మేరకు అనుమతులు జారీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు, వివిధ శాఖల వద్ద దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 50 పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులకు గాను 36 యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేశామని అధికారులు వివరించారు.

News February 4, 2026

‘డిసెంబర్ 31 నాటికి బందరు పోర్ట్ తొలి దశ పూర్తి’

image

బందరు ఓడరేవు తొలి దశలో 4 బెర్తుల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని మెగా ఇంజినీరింగ్ లిమిటెడ్ జీఎం తులసీదాసు తెలిపారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలోని బృందం ప్రాజెక్ట్ పనులను బుధవాం పరిశీలించింది. 2000 ఎకరాల్లో సాగుతున్న పనుల్లో 1300 మంది కూలీలు పనిచేస్తున్నట్లు వివరించారు.

News February 4, 2026

వరంగల్: ఎవరా ప్యాకేజీ స్టార్?

image

ఉమ్మడి WGLలో ఓ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవడానికి BRS, కాంగ్రెస్‌లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఓ BRS కౌన్సిలర్ అభ్యర్థిని ట్రాప్ చేసిన హస్తం, పార్టీ మారి విత్ డ్రా చేసుకుంటే రూ.20లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. రెండ్రోజుల ముందు రూ.5లక్షలు, చివరి నిమిషంలో విత్ డ్రా చేసుకుంటే మరో రూ.15లక్షలు ఆఫర్ ఇచ్చిందట. విషయం తెలుసుకున్న గులాబీవాళ్లు, వారి ఆఫర్ కంటే ఎక్కువిచ్చి హస్తం‌కి షాక్ ఇచ్చారు.