News January 14, 2026
ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.
Similar News
News January 29, 2026
నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు

ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఇవాళ ఉ.11 గంటలకు జరగనున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. పవార్ అంత్యక్రియలకు PM మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, MH సీఎం ఫడణవీస్, AP మంత్రి లోకేశ్ హాజరవనున్నారు. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ సహా ఐదుగురు మరణించారు.
News January 29, 2026
మొక్కజొన్న పంటకు నీరు – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మొక్కజొన్న పూత దశలో నీటి ఎద్దడి వల్ల మగపూలు, పీచు ఎండిపోయి, పరాగ సంపర్కం సరిగా జరగక, పై ఆకులు ఎండిపోయి కండెలో గింజల సంఖ్య, పరిమాణం తగ్గుతుంది. పంట పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైతే 40 నుంచి 80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజ కట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే గింజ పరిమాణం తగ్గుతుంది. అందుకే పంట ఎదిగే దశలో ఎక్కువ వ్యవధితో, పూత దశలో తక్కువ వ్యవధితో నీరు పెట్టాలి.
News January 29, 2026
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.


