News January 14, 2026

సింగర్ మరణం.. మద్యం మత్తులోనే జరిగిందన్న సింగపూర్ పోలీసులు

image

అస్సాం సింగర్ జుబీన్ గార్గ్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని సింగపూర్ పోలీసులు తేల్చినట్లు ఆ దేశ కోర్టు వెల్లడించింది. ‘జుబీన్ మద్యం మత్తులో ఉన్నాడు. వేసుకున్న లైఫ్ జాకెట్ విప్పేశాడు. మళ్లీ ఇస్తే వేసుకోలేదు’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో సింగపూర్ వెళ్లిన జుబీన్ స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోగా, ఆయన్ను హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి.

Similar News

News February 4, 2026

రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు: పంకజ్ చౌదరి

image

డిజిటల్ చెల్లింపులు జరిపేవారి సంఖ్య పెరగడంతో.. భారత UPI లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం DEC వరకు UPI ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని, భారత్ వెలుపలా UPI వినియోగం పెరగడం హర్షణీయమన్నారు.

News February 4, 2026

నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని YCP అధినేత జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. రోడ్డు మార్గాన 11 గంటలకు గుంటూరులోని రాంబాబు ఇంటికి చేరుకుంటారు. అయితే గుంటూరు పరిధిలో 1861లోని సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ ర్యాలీ, సమావేశం నిర్వహించడం, పాల్గొనడం నిషేధమని పోలీసు శాఖ పేర్కొంది.

News February 4, 2026

మున్సిపల్ ప్రచారానికి సీఎం.. మిర్యాలగూడలో తొలి సభ

image

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్‌లో నిర్వహించే ఎన్నికల సభల్లో రేవంత్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.