News January 14, 2026
కొత్తకొండ వీరభద్రుడికి కుమ్మరి బోనం

భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడిపికొండ, దామెర కుమ్మరి వంశస్తులు ఆనవాయితీ ప్రకారం భోగి రోజున వీరబోనం చేశారు. శివసత్తుల నృత్యాలు, వీరశైవుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చి గండ దీపం వద్ద నూనె పోసి, కోరుకున్న కోరికలకు మీసాలు, కోడె మొక్కులు సమర్పించారు.
Similar News
News February 19, 2026
ఈనెల 20న గద్వాలలో జాబ్ మేళా..!

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. శ్రీ చరణ్ దీప్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎఫ్ 30/1 లో ఉదయం 11:00 గంటలకు జరిగే జాబ్ మేళాకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు హాజరు కావాలన్నారు.
News February 19, 2026
HYD: TG FSLలో జాబ్స్.. పరీక్షల తేదీలివే..!

TG ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి రాత పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5, 6, 7 తేదీలలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
News February 19, 2026
మామిడి కాయలకు ‘ఫ్రూట్ కవర్స్’తో లాభం

వాతావరణ పరిస్థితులు, పురుగులు, పండు ఈగ, ఇతర కీటకాల వల్ల మామిడి పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మ లేదా కోడి గుడ్డు సైజుకు మామిడి కాయ వచ్చాక ‘ఫ్రూట్ కవర్స్’ కట్టాలి. దీని వల్ల చెట్టుపై రసాయనాలు పిచికారీ చేసినా అవి పండుపై పడవు. అలాగే కవర్ కట్టిన కాయపై ఎలాంటి మచ్చలు, చీడపీడల లక్షణాలు కనిపించవు. ఇతర కాయల కంటే ఎక్కువ బరువు పెరిగి మంచి ధర పలుకుతాయి. ఈ కవర్స్ వాటర్ ప్రూఫ్. నీరు పడినా ఏమీ కావు.


