News January 14, 2026

గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు

image

గ్రామీణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సంబరాలలో ఎస్పీ జగదీశ్ దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. భోగి మంటలు వెలిగించి గాలిపటాలు ఎగురవేశారు. ఎస్పీ గుండాట ఆడి, ఉట్టి కొట్టారు.

Similar News

News March 11, 2026

పరీక్షలకు 269 మంది విద్యార్థుల గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు సెట్-III ప్రశ్న పత్రాన్ని వాడామని RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 4,069 గాను 3,937 మంది హాజరు కాగా 132 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,468 గాను 1,331 మంది హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.