News January 14, 2026

జగిత్యాలలో జర్నలిస్టుల ధర్నా

image

HYDలో జర్నలిస్ట్‌ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ జగిత్యాలలో TUWJ (IJU) ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్ట్‌లు నిరసనకు దిగారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా NTV INPUT ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్‌ల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Similar News

News February 6, 2026

గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

image

దేశంలో ఉద్యోగ మార్కెట్‌ క్రమంగా కోలుకుంటుండటంతో జీతాల్లో పెంపు ప్రారంభమైందని మైఖేల్‌ పేజ్‌ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాల్లో జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ‘ది శాలరీ గైడ్‌-2026’ నివేదికలో తెలిపింది. కొత్త స్కిల్స్ ఉన్నవారు ఉద్యోగాలు మారితే కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్‌ చేస్తున్నాయని పేర్కొంది. CFO, CTO, ఇంజినీరింగ్‌ హెడ్స్‌కు డిమాండ్‌ పెరిగిందని తెలిపింది.

News February 6, 2026

హైదరాబాద్‌ తాజ్‌మహల్‌ గురించి తెలుసా?

image

HYD అంటేనే సకల కళల సమ్మేళనంగా వెలుగొందే మహానగరం. వందల ఏళ్ల కట్టడాలకు తార్కాణం. అందులో ప్రత్యేక కళాఖండంగా నిలిచేది ‘పైగా టూంబ్స్‌’. ఈ పాలరాతి నిర్మాణం ప్రశాంతతను పంచుతుంది. అద్భుత ఆర్కిటెక్చర్‌ మంత్రముగ్ధులను చేస్తోంది. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచింది. వీటిని 1786లో పైగా వంశానికి చెందిన అమీర్-ఎ-కబీర్‌ పిసల్ బండలో ప్రారంభించారు. ఇక్కడ 32 విలాస సమాధులు ఉన్నాయి. ‘పైగా’ అనేది నిజాంలు ఇచ్చిన బిరుదు.