News January 15, 2026
ఏలూరులో ఎండ్ల బండిపై ఎస్పీ దంపతుల సందడి

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
Similar News
News February 11, 2026
ఫిబ్రవరి 11: చరిత్రలో ఈరోజు

1847: అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం
1865: తెలుగు సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
1942: బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ మరణం
1974: సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం (ఫొటోలో)
1977: భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం
News February 11, 2026
అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్ర: రోహిత్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన <<18980385>>ప్రమాదం<<>> వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ముందు రోజే అజిత్ బారామతికి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా షెడ్యూల్ మారే పరిస్థితులు వచ్చాయి. విమానంలో సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? పైలట్ కపూర్ గతంలో డ్రంకెన్ పైలట్ లిస్ట్‌లో ఉన్నారని, ప్రయాణానికి ముందు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగాయా’ అని ప్రశ్నలు లేవనెత్తారు.
News February 11, 2026
సంగారెడ్డి: ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో సెలవు

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో నేడు జరగనున్న ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు కలెక్టర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి సెలవుదినంగా ప్రకటించినట్లు వివరించారు.


