News April 25, 2024
జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు: చంద్రబాబు

AP: సీఎం జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని TDP చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ తిరుగుబాటే జగన్‌ను ఇంటికి పంపిస్తుందని, రాయలసీమలో అన్ని సీట్లూ కూటమే కొల్లగొడుతుందని చెప్పారు. ‘వైసీపీకి ఓటేస్తే ప్రజల గతి ఇక అంతే. మద్యం వ్యాపారంతో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం చేస్తోంది. ఆ కుటుంబాన్ని జిల్లా నుంచి తరిమేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
పెద్దపల్లి: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో DWSM విభాగంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి గ్రామానికి నీరు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News January 21, 2026
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.
News January 21, 2026
నీటి నిష్క్రమణ ఏ దిశలో ఉండటం వాస్తు సమ్మతం?

ఇంటి వాడకం నీరు, వర్షపు నీరు ఈశాన్యం నుంచే వెళ్లాలని అంటారు. కానీ ఇది అన్ని దిశల ఇళ్లకు వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పడమర/ దక్షిణం వైపు రోడ్లు ఉన్న ఇళ్లకు ఈశాన్యం లోపలి వైపు ఉంటుంది. అలాంటివారు పడమర వాయువ్యం/దక్షిణ ఆగ్నేయం దిశల నుంచి నీటిని బయటకు పంపాలి. ప్రతి దిక్కుకు ఉండే శుభ ఫలితాలనిచ్చే మూలల ద్వారా నీరు వెళ్లడం వల్ల ఎటువంటి హాని జరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


