News January 15, 2026
పండక్కి అల్లుళ్లను ఇంటికి ఎందుకు పిలుస్తారు?

అల్లుడిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆయనకు చేసే మర్యాదలు ఆ నారాయణుడికే చెందుతాయని, దీనివల్ల పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలాగే, పంట చేతికొచ్చే సమయంలో కూతురు, అల్లుడిని పిలిచి విందులు, వస్త్రదానాలతో సత్కరించడం ద్వారా 2 కుటుంబాల మధ్య బంధం బలపడుతుంది. అందుకే కొత్త అల్లుడు సంక్రాంతికి అత్తవారింటికి రావడం మన సంస్కృతిలో మధురమైన సంప్రదాయంగా మారింది.
Similar News
News February 21, 2026
17 లక్షల యాప్స్‌పై బ్యాన్!

ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం ప్లేస్టోర్ క్లీనింగ్ చర్యలను గూగుల్ చేపట్టింది. ఫేక్, పాలసీలను ఉల్లంఘిస్తున్న 17.5 లక్షల యాప్స్‌ను బ్యాన్ చేసింది. హానికరమైన, ఫేక్ యాప్స్‌కు చెందిన 80 వేల డెవలపర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. మరోవైపు 16 కోట్ల స్పామ్ రేటింగ్స్, ఫేక్ ఫీడ్ బ్యాక్స్‌ను డిలీట్ చేసింది. 2.55 లక్షల యాప్స్ అనవసరంగా లొకేషన్, ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడగకుండా నిరోధించినట్లు కంపెనీ తెలిపింది.
News February 21, 2026
సూపర్-8 సమరం ఇవాళ్టి నుంచే!

T20 WCలో లీగ్ దశ ముగిసింది. ఇవాళ్టి నుంచి సూపర్-8 సమరం మొదలుకానుంది. మొత్తం 8 టీమ్స్‌లో టాప్-4 సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. నేటి రాత్రి 7 గంటలకు కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లండ్, శ్రీలంక, రాత్రి 7 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మ్యాచులు జరగనున్నాయి.