News January 15, 2026

MHBD: మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు ఇవే!

image

జిల్లాలో 4 మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు అధికారులు ప్రకటించారు. MHBD మున్సిపాలిటీలో ఎస్టీ 7,ఎస్సీ 5, జనరల్ మహిళ 10, జనరల్ 8, బీసీ 6 (మొత్తం 36), డోర్నకల్ ఎస్టీ 3, ఎస్సీ 4, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం15), మరిపెడ ఎస్టీ 6, ఎస్సీ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం 15), తొర్రూరు ఎస్టీ 2, ఎస్సీ 3, జనరల్ మహిళ 5, జనరల్ 3, బీసీ 3 (16) కాగా, కేసముద్రం రిజర్వేషన్ రావాల్సి ఉంది.

Similar News

News February 11, 2026

SBI సరికొత్త రికార్డు!

image

బ్యాంకింగ్ దిగ్గజం SBI సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ విలువలో తొలిసారి ₹10 లక్షల కోట్ల మార్కును దాటింది. రిలయన్స్, HDFC, ఎయిర్‌టెల్, TCS, ICICI బ్యాంక్ తర్వాత ఈ ఘనత అందుకున్న ఆరో కంపెనీగా నిలిచింది. అత్యంత విలువైన కంపెనీల్లోనూ ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు SBI షేరు నిన్న ₹1,154తో ఆల్ టైమ్ హై అందుకుంది. ఏడాదిలో 67.5% ఎగిసింది. ఇందులో వాటాలున్న LICకి ₹40 వేల కోట్ల లాభం రావడం గమనార్హం.

News February 11, 2026

మనస్సును ప్రశాంతంగా మార్చే భైరవీ ముద్ర

image

సుఖాసనంలో కానీ పద్మాసనం/వజ్రాసనంలో కూర్చోవాలి. నడుం వంగకుండా నిటారుగా ఉండేలా చూడాలి. రెండు చేతులను ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన , ఎడమ చేయి కింద ఉండేవిధంగా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుని వదులుతూ శ్వాసమీద ధ్యాసను ఉంచాలి. కనీసం 7నిమిషాల సమయం ఈ భైరవి ముద్రలో ఉంటే మనస్సు ప్రశాతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

News February 11, 2026

కర్నూలుపై నంద్యాల జట్టు భారీ విజయం

image

కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న MA ఇస్పహాన్ మెమోరియల్ ట్రోఫీ అండర్-14 లీగ్ మ్యాచ్‌లో మంగళవారం నంద్యాల(సి) జట్టు ఘన విజయం సాధించింది. కర్నూలు(సి) జట్టుపై 125 పరుగుల భారీ తేడాతో గెలిచినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దేవేంద్ర గౌడ్ తెలిపారు. నంద్యాల జట్టు ప్లేయర్ శ్రీవేంద్రనాథ్ 71 పరుగులతో పాటు 5 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. ధనుష్ సాయి 5 వికెట్లు పడగొట్టాడు.