News January 15, 2026
ఇరాన్‌పై అమెరికా యుద్ధం?.. సిద్ధంగా డ్రోన్లు, విమానాలు!

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో నిరసనకారులపై జరుగుతున్న హింసను అడ్డుకుంటామని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలోని US స్థావరాల నుంచి వందలాది యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎయిర్ ట్యాంకర్లు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ కూడా ‘ప్రతీకార దాడులు తప్పవు’ అంటూ రివర్స్ వార్నింగ్ ఇచ్చింది.
Similar News
News February 22, 2026
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
News February 22, 2026
కర్ణాటకలో పవర్ షేరింగ్‌పై త్వరలో కీలక ప్రకటన!

కర్ణాటకలో CM సిద్దరామయ్య, Dy.CM DK శివకుమార్ మధ్య సాగుతున్న అధికార పోరుకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ముగింపు పలకనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సతీశ్ జార్కీహోళీ తెలిపారు. పవర్ షేరింగ్‌పై హైకమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన అనంతరం ఆయన వెల్లడించారు. సిద్దరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో అధికారాన్ని తనకు అప్పగించాలని శివకుమార్ కోరుతున్న విషయం తెలిసిందే.
News February 22, 2026
చిక్కిపోతున్న చందమామ!

చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నాడని నేషనల్ ఎయిర్&స్పేస్ మ్యూజియానికి చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రకంపాల వల్ల ఏర్పడే పగుళ్లే ఇందుకు కారణమని చెబుతున్నారు. చందమామపై పగుళ్ల గురించి శాస్త్రవేత్తలకు 2010 నుంచే తెలిసినా తాజాగా లూనార్ మారియా ప్రాంతాల్లో 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. వీటిని స్మాల్ మేర్ రిడ్జెస్ అని పిలుస్తున్నారు.


