News January 15, 2026
నల్గొండలో ఇక నవ శకం!

నల్గొండను నగరపాలక సంస్థగా మార్చడంతో పాలనలో కొత్త శకం ప్రారంభంకానుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నల్లగొండ మునిసిపాలిటీగా కొనసాగగా, ఇకపై కార్పొరేషన్‌గా కొనసాగుతుంది. కార్పొరేషన్ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. నగర ప్రథమ పౌరుడిగా మేయర్ కొనసాగుతారు. రాజకీయంగా మేయర్ పదవికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. మంత్రులతో సరిసమానమైన ప్రోటోకాల్ ఉంటుంది.
Similar News
News April 10, 2026
ఆర్టీసీ భూములు సరే.. గీతం సంగతేంటి: YCP

AP: విజయవాడ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన RTC భూములను చంద్రబాబు కమీషన్ తీసుకొని లులూకు కట్టబెట్టారని YCP ఆరోపించింది. ఈ అక్రమ భూకేటాయింపులపై తాము చేసిన పోరాటానికి దెబ్బకి దిగొచ్చి కేటాయింపులను రద్దు చేసుకున్నారని తెలిపింది. RTC భూములు సరే, విశాఖలో గీతం యూనివర్సిటీకి కట్టబెట్టిన రూ.5వేల కోట్ల విలువైన భూముల సంగతేంటి CBN? అని ప్రశ్నించింది. ఆ కేటాయింపులను ఎప్పుడు రద్దు చేస్తారు? అని ట్వీట్ చేసింది.
News April 10, 2026
NZB: టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్

నేటి నుంచి టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఇందల్వాయి (44వ జాతీయ రహదారి), బిక్కనూర్ వద్ద టోల్ చెల్లింపులు కేవలం ఫాస్టాగ్ లేదా UPI ద్వారానే జరుగుతాయి. ఫాస్టాగ్ లేని పక్షంలో వాహనదారులు 1.25 రెట్లు అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుతో టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ తగ్గి, ప్రయాణం సులభతరం కానుంది.
News April 10, 2026
BSNL కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.599కే 70 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో రోజుకు 3GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్‌టెల్ యూజర్లు ఇదే తరహా బెనిఫిట్స్ కోసం దాదాపు రెండింతలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ ధరలో ఎక్కువ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.


