News January 15, 2026

సైనికుల ఖార్ఖానా.. బావాజీపాలెం

image

నేడు జాతీయ సైనిక దినోత్సవం. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని ‘జవాన్ల ఊరు’గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు సైన్యంలో పనిచేస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు ఇక్కడి వారు దేశసేవలో తరిస్తున్నారు. యువత ఉదయాన్నే మైదానంలో కసరత్తులు చేస్తూ, ఆర్మీలో చేరడమే ఏకైక లక్ష్యంగా శ్రమిస్తుంటారు.

Similar News

News March 12, 2026

GOOD NEWS గుంటూరు: రేపే నగదు జమ

image

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని 1,06,329 మంది రైతులకు రూ.59.28 కోట్ల నిధులు ఖాతాల్లో జమ చేసేందుకు గురువారం అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిలో రూ.42.53 కోట్లు అన్నదాత సుఖీభవ కాగా, రూ.16.75 కోట్లు PM కిసాన్ నిధులుగా చెప్పారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు.

News March 12, 2026

గుంటూరులో LPG సిలిండర్ల స్వాధీనం

image

విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గుంటూరులో దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న గృహ వినియోగ LPG సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వీట్ షాపులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేసి మొత్తం 26 సిలిండర్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సెంటీల కమోడిటీస్ యాక్ట్, 1955 సెక్షన్ 6-A కింద 6 కేసులు నమోదు చేసి సంబంధిత అధికారులకు నివేదిక అందించారు.

News March 12, 2026

‘జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

image

జిల్లాలో శనగల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జేసీ అశుతోష్ శ్రీవాత్సవకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం శనగ పంటకు క్వింటాకు రూ.5,875 ఉన్నా మార్కెట్లో రూ4,500 మాత్రమే ధర లభిస్తుందని జేసీకి వివరించారు. కొనుగోళ్ల కేంద్రాలను పెంచి సమస్యను పరిష్కరించాలన్నారు. వినతి ఇచ్చినవారిలో తిరుపతిరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.