News January 15, 2026

ఎగుమతుల్లో వృద్ధి.. అమెరికాకు అధికం!

image

TG: ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. 2023లో రూ.95వేల కోట్లుగా ఉన్న ఎగుమతులు 2024-2025 నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరాయి. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తయారీ రంగంలో ఎగుమతుల్లో 35.2% కేవలం ఫార్మా ఉత్పత్తులే ఉన్నాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎగుమతులు USకు(28.17 శాతం) జరుగుతున్నాయి. అటు ఈ అంశంలో దేశంలోనే గుజరాత్ టాప్‌ ప్లేస్‌లో ఉంది.

Similar News

News February 12, 2026

కిసాన్ రైల్ ద్వారా 34 వేల టన్నుల పంట ఉత్పత్తుల రవాణా

image

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కిసాన్ రైల్ ద్వారా 116 సర్వీసులతో 34వేల టన్నుల పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2020 AUG 7న కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. AP నుంచి మామిడి, అరటి, ఉల్లి ఇతర ఉద్యాన ఉత్పత్తులను బిహార్, అస్సాం, ప.బెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు రవాణా చేశామని.. లోక్‌సభలో TDP MP ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

News February 12, 2026

IMA డెహ్రాడూన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA)డెహ్రాడూన్‌లో 10 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD, NET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianmilitaryacademy.nic.in/

News February 12, 2026

మూల్యాంకనంలో తప్పులు జరగకుండా CBSE కీలక నిర్ణయం

image

12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం CBSE మళ్లీ ఆన్‌-స్క్రీన్ మార్కింగ్ (OSM) పద్ధతిని ప్రారంభించాలని నిర్ణయించింది. స్కాన్ చేసిన జవాబు పత్రాలను ఉపాధ్యాయులు కంప్యూటర్లలోనే దిద్ది, మార్కులు వేస్తారు. సాఫ్ట్‌వేర్ ద్వారా మార్కులు ఆటోమేటిక్‌గా లెక్కించడంతో కూడికలో తప్పులు జరగవని బోర్డు భావిస్తోంది. ఫలితాలు చాలా వేగంగా, పారదర్శకంగా విడుదల చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.