News January 15, 2026
జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్‌లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్‌ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్‌తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్‌లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.
Similar News
News February 15, 2026
ఓటుకు అమ్ముడుపోయావా? నీ కోసమే..

TG: ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బులను వెనక్కి తీసుకుంటున్నట్లు పలుచోట్ల చూస్తున్నాం. ఇదే లెక్కన డబ్బులిచ్చి గెలిచిన అభ్యర్థులు ఓటర్లకు విలువ ఇస్తారా? అవినీతి లేకుండా పని చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ఓటుకు నోటు’ తీసుకున్న వారు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోలేరు. చెప్పుకున్నా ‘అమ్ముుడుపోయారుగా’ అని గెలిచినవాడు లెక్కచేయడు. అందుకే నోటు తీసుకోకుండా ఓటేసి చూడండి. ఆ ధైర్యమే వేరు.
News February 15, 2026
భారత్-పాక్ మ్యాచ్.. వర్షానికి 70% ఛాన్స్!

కొలంబోలో ఈ రాత్రి జరగనున్న భారత్-పాక్ T20 WC మ్యాచ్‌పై వరుణుడి నీడ కమ్ముకొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 70% వర్షం కురిసే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు (సాయంత్రం 6-7 గంటల మధ్య) భారీ వర్షం, ఆ తర్వాత జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. లేదా ఓవర్లను భారీగా తగ్గించాల్సి రావచ్చు.
News February 15, 2026
జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే కావాలి: పవన్

AP: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రారంభించారు. రూ.2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. 150 మందితో పార్టీని ప్రారంభించగా 2024 ఎన్నికల తర్వాత అది 12.98 లక్షలకు చేరుకుందని పవన్ చెప్పారు. జనసేన భావజాలాన్ని అర్థం చేసుకొని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి అవసరమని వ్యాఖ్యానించారు.


