News January 15, 2026

వికారాబాద్: అంగన్వాడీల్లో ఇన్ని ఖాళీ పోస్టులా?

image

VKB జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా, టీచర్ల కొరత వేధిస్తోంది. కొడంగల్ ప్రాజెక్టులో 234 కేంద్రాలు ఉండగా.. 73 ఆయా, 14 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మర్పల్లి 148 కేంద్రాలు ఉండగా.. 41 ఆయా, 30 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిగి ప్రాజెక్టులో 235 కేంద్రాలు ఉండగా.. 112 ఆయా, 21 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ ప్రాజెక్టులో 233 కేంద్రాలు ఉండగా.. 82 ఆయా, 18 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Similar News

News February 13, 2026

పేట: సీఎం కప్ పోటీలు.. విజేతలు వీరే!

image

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ పీఎంశ్రీ గిరిజన గురుకులంలో సీఎం కప్ పోటీలు నిర్వహించారు. ఎంఈవో, ఎంపీడీవో గాయత్రి జిల్లా డీవైఎస్ఓ శెట్టి వెంకటేశ్, గ్రామ సర్పంచ్ భీమయ్య, గురుకులం ప్రిన్సిపల్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.
✒ఫుట్ బాల్: 1.ధన్వాడ, 2.మక్తల్
✒నెట్ బాల్: 1.ధన్వాడ, 2.గుండుమల్
✒హ్యాండ్ బాల్: 1.ధన్వాడ, 2.దామరగిద్ద
✒అట్యా పటియా: 1.ధన్వాడ, 2.మక్తల్

News February 13, 2026

శ్రీశైలంలో మల్లన్నకు నేడు పుష్ప పల్లకీ సేవ

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన నేడు శ్రీశైలం మల్లన్నకు పుష్ప పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఉదయం నుంచి చండీస్వర పూజ, రుద్ర, చండీ హోమాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. సాయంత్రం ప్రత్యేక పూజలతో పాటు పుష్కరిణి, శివ దీక్ష శిబిరాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులను సౌకర్యం కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

News February 13, 2026

జనగామ: ఒకే రౌండ్‌లో వార్డుల వారీగా లెక్కింపు!

image

జనగామలోని 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ఒకే రౌండులో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్ 18 వార్డులకు 18 టేబుల్స్‌లో లెక్కింపు చేపట్టి ఒకే రౌండ్లో ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. జనగామ లెక్కింపు కేంద్రంలో 36 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 72 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు, స్టేషన్ ఘన్పూర్‌లో 20 మంది సూపర్వైజర్లు, 40 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు విధుల్లో ఉన్నారు.