News January 15, 2026
శ్రీకాళహస్తిలో గిరిప్రదక్షిణకు ముందు ఏం చేస్తారంటే..?

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరఫున సద్యోమూర్తి పల్లకిసేవ ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందు రోజున సద్యోమూర్తి పల్లకి సేవ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఫిబ్రవరి నెలలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కైలాసగిరి పర్వతాలపై ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు స్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణ జరుగుతుంది.
Similar News
News February 10, 2026
పుంగనూరు: రౌడీషీటర్ దారుణ హత్య

పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డీజే భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హత్యకు గురై ఉండగా స్థానికులు గుర్తించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మృతుడిపై పలు కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఘటనపై నంగిలి పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2026
CMపై భూకబ్జా ఆరోపణలు..రూ.500 కోట్లకు పరువు నష్టం దావా

రాష్ట్రంలో సుమారు 7,440 ఎకరాల భూమిని తాను, కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలను అస్సాం CM హిమంత బిశ్వ శర్మ ఖండించారు. తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగోయ్‌పై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు SM ద్వారా CM తెలిపారు. ఆధారాలు ఉంటే కోర్టులో నిరూపించాలని డిమాండ్ చేశారు.
News February 10, 2026
నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌లో 376 పోస్టులు

న్యూఢిల్లీలోని <


