News January 15, 2026

ఇవి తీసుకుంటే PCODకి చెక్

image

ఈ మధ్య కాలంలో మహిళలను PCOD ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వల్ల అవాంఛిత రోమాలు రావడం, పీరియడ్స్ అస్తవ్యస్తంగా మారతాయని నిపుణులు. అయితే ఇది తగ్గాలంటే ఆహారంలో దాల్చిన చెక్క పొడి, పుదీనా టీ, ఫ్లాక్స్ సీడ్స్ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, వ్యాయామం చేయడం, మంచి డైట్ తీసుకోవడం కూడా ముఖ్యమని చెబుతున్నారు.

Similar News

News February 8, 2026

మమ్ముట్టి పేరు వెనుక ఆసక్తికర కథ

image

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. కాలేజీ రోజుల్లో తన పేరు పాతగా అనిపించడంతో ‘ఒమర్ షరీఫ్’గా పరిచయం చేసుకునేవారు. అయితే ఒకసారి పాకెట్ నుంచి ఐడీ కార్డు పడిపోవడంతో ఓ స్నేహితుడు మహ్మద్ కుట్టిని ‘మమ్ముట్టి’గా పిలిచాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతా ఆ పేరుతోనే పిలిచేవారు. అదే చివరికి స్క్రీన్ నేమ్‌గా మారింది. తాజాగా ఆయన పద్మభూషణ్ అందుకున్నారు.

News February 8, 2026

వంటింటి చిట్కాలు

image

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్‌ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.

News February 8, 2026

బలవంతంగా మతం మారిన వారిని తిరిగి తీసుకురావాలి: RSS చీఫ్

image

RSSలో ఏ కులానికి చెందిన వారైనా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని, బ్రాహ్మణుడిగా ఉండటం అర్హత కాదని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇంగ్లిష్ పట్ల తమకు శత్రుత్వం లేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. బలవంతంగా మతం మారిన వారిని ‘ఘర్ వాపసీ’ ద్వారా తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.