News January 15, 2026
RITESలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

RITESలో 7 అసిస్టెంట్ మేనేజర్(HR)పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 27 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి MBA/PGDBM/PGDM/PGDHRM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000-రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/
Similar News
News February 4, 2026
రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు: పంకజ్ చౌదరి

డిజిటల్ చెల్లింపులు జరిపేవారి సంఖ్య పెరగడంతో.. భారత UPI లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం DEC వరకు UPI ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని, భారత్ వెలుపలా UPI వినియోగం పెరగడం హర్షణీయమన్నారు.
News February 4, 2026
నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని YCP అధినేత జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. రోడ్డు మార్గాన 11 గంటలకు గుంటూరులోని రాంబాబు ఇంటికి చేరుకుంటారు. అయితే గుంటూరు పరిధిలో 1861లోని సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ ర్యాలీ, సమావేశం నిర్వహించడం, పాల్గొనడం నిషేధమని పోలీసు శాఖ పేర్కొంది.
News February 4, 2026
మున్సిపల్ ప్రచారానికి సీఎం.. మిర్యాలగూడలో తొలి సభ

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్‌లో నిర్వహించే ఎన్నికల సభల్లో రేవంత్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.


