News January 15, 2026
APలో ఖమ్మం ఎమ్మెల్యేల సందడి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ APలోని నూజివీడు నియోజకవర్గంలో సందడి చేశారు. నూజివీడులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ఎమ్మెల్యేలు సతి సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడిపందాలను వీక్షించారు. అటు సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.
Similar News
News February 12, 2026
తగ్గిన ధరలు.. రూ.50కే 4 కేజీల టమాటా

తెలుగు రాష్ట్రాల్లో టమాటాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో రూ.50కే 4 కేజీల టమాటాలు విక్రయిస్తున్నారు. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి రూ.5 మాత్రమే దక్కుతుండటంతో రోడ్లపైనే పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఉల్లిపాయల ధరలు సైతం తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.
News February 12, 2026
పెద్దపల్లి : ఓటింగ్‌లో మగువలే మేటి!

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,28,023 మంది మహిళా ఓటర్లకు గానూ 91,873 మంది పోలింగ్‌లో పాల్గొనడంతో 71.76 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండంలో 62,868, పెద్దపల్లిలో 16,319, సుల్తానాబాద్‌లో 7,023, మంథనిలో 5,663 మంది మహిళలు ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో మహిళా లోకం చైతన్యం చూపిస్తూ పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం విశేషం.
News February 12, 2026
పెద్దపల్లి జిల్లాలో ఓవరాల్ పోలింగ్ శాతం ఎంతంటే…

జిల్లాలోని నాలుగు పురపాలికలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్‌గా 75.28 శాతం పోలింగ్ నమోదయింది. రామగుండం కార్పొరేషన్‌లో 69.32%, పెద్దపల్లి పురపాలక సంఘం 73.54%, సుల్తానాబాద్ పురపాలక సంఘంలో 81.53%, మంథని పురపాలక సంఘం పరిధిలో 76.76% ఓటింగ్ నమోదయింది. కాగా రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


