News January 15, 2026

OTD: టీమ్ ఇండియా ఘన విజయం

image

సరిగ్గా ఇదే తేదిన మూడేళ్ల క్రితం శ్రీలంకపై టీమ్ ఇండియా అద్భుతమైన విజయం నమోదు చేసింది. గిల్(116), కోహ్లీ(166*) సెంచరీల విధ్వంసం చేయగా భారత్ 50 ఓవర్లలో 390/5 స్కోరు చేసింది. ఛేదనలో సిరాజ్ 4, షమీ, కుల్దీప్ చెరో 2 వికెట్లతో చెలరేగడంతో SL 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో 317 పరుగుల తేడాతో ఘనవిజయం సొంతమైంది. పరుగులు పరంగా ODIల్లో భారత్‌కు ఇదే భారీ విజయం. ఈ మ్యాచులో కోహ్లీ POTMగా నిలిచారు.

Similar News

News February 18, 2026

ఆస్ట్రేలియా ఔట్.. వరుసగా మూడో సారి!

image

వరుస ఓటములతో టీ20 WC సూపర్-8 రేసు నుంచి ఆస్ట్రేలియా <<19167885>>నిష్క్రమించడం<<>> తెలిసిందే. సెమీఫైనల్ దాకా చేరకుండా ఆ జట్టు వైదొలగడం వరుసగా మూడో సారి. 2021లో ఆసీస్ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ 2022లో సూపర్-12, 2024లో సూపర్-8 దశలోనే ఇంటిదారి పట్టింది. 2024లో అఫ్గాన్ దెబ్బకొడితే, ఈసారి జింబాబ్వే షాకిచ్చింది. దీంతో లీగ్ దశలో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పలేదు.

News February 18, 2026

మెదక్ కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

image

TG: న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపేసింది. అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు గడువిచ్చింది.

News February 18, 2026

ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

image

1745: బ్యాటరీ ఆవిష్కర్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (ఫొటోలో)
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం