News January 15, 2026

HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.

Similar News

News February 12, 2026

తగ్గిన ధరలు.. రూ.50కే 4 కేజీల టమాటా

image

తెలుగు రాష్ట్రాల్లో టమాటాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్లో రూ.50కే 4 కేజీల టమాటాలు విక్రయిస్తున్నారు. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి రూ.5 మాత్రమే దక్కుతుండటంతో రోడ్లపైనే పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఉల్లిపాయల ధరలు సైతం తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.

News February 12, 2026

పెద్దపల్లి : ఓటింగ్‌లో మగువలే మేటి!

image

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,28,023 మంది మహిళా ఓటర్లకు గానూ 91,873 మంది పోలింగ్‌లో పాల్గొనడంతో 71.76 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండంలో 62,868, పెద్దపల్లిలో 16,319, సుల్తానాబాద్‌లో 7,023, మంథనిలో 5,663 మంది మహిళలు ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో మహిళా లోకం చైతన్యం చూపిస్తూ పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం విశేషం.

News February 12, 2026

పెద్దపల్లి జిల్లాలో ఓవరాల్ పోలింగ్ శాతం ఎంతంటే…

image

జిల్లాలోని నాలుగు పురపాలికలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓవరాల్‌గా 75.28 శాతం పోలింగ్ నమోదయింది. రామగుండం కార్పొరేషన్‌లో 69.32%, పెద్దపల్లి పురపాలక సంఘం 73.54%, సుల్తానాబాద్ పురపాలక సంఘంలో 81.53%, మంథని పురపాలక సంఘం పరిధిలో 76.76% ఓటింగ్ నమోదయింది. కాగా రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.