News January 15, 2026
వచ్చే నెలలో సూర్యగ్రహణం.. భారత్‌లో నో ఎఫెక్ట్!

వచ్చే నెల 17(మంగళవారం)న సూర్యగ్రహణం సంభవించనుంది. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పేర్కొంటున్నారు. భారత కాలమాన ప్రకారం సా.5.11 గంటలకు ఈ గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది మనదగ్గర కనిపించదు. అంటార్కిటికా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో చూడవచ్చు. మన దేశంలో కనిపించే అవకాశం లేకపోవడంతో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
Similar News
News February 20, 2026
GREAT: ఓటమి నుంచి ప్రపంచ రికార్డుల వరకు!

మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ప్రస్థానాన్ని ప్రారంభించి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన యువతలో స్ఫూర్తి నింపే పోస్ట్ చేశారు. మొదట్లో ఎవరూ తన వీడియోలు చూడలేదని, అందరూ తనను హేళన చేస్తూ సమయం వృథా అని విమర్శించారని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ పట్టుదలతో శ్రమించి 468M సబ్‌స్క్రైబర్లతో Mr Beast ప్రపంచంలోనే టాప్ యూట్యూబర్‌గా ఎదిగారు. ఇప్పటివరకు ఆ ఛానల్‌కు 11వేల కోట్ల వ్యూస్ రావడం విశేషం.
News February 20, 2026
చిక్కు తీసిన వెంట్రుకలను ఎక్కడ పడేస్తున్నారు?

తల దువ్వుకున్నాక రాలిన వెంట్రుకలను కొందరు ఇంటి మూలల్లో పారేస్తుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు పండితులు. దీనివల్ల ప్రతికూల శక్తి పేరుకుపోతుందని చెబుతున్నారు. ‘వెంట్రుకలు త్వరగా కుళ్లిపోవు. ఇవి గాలికి ఎగిరి మళ్లీ ఇంట్లోకే రావొచ్చు. ఆహార పదార్థాలలో పడొచ్చు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిని ఇంటికి బయట దూరంగా పడేయాలి. ఇలా చేస్తే రాహు దోషం తగ్గుతుంది’ అని చెబుతున్నారు.
News February 20, 2026
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<


