News January 15, 2026
కొత్తకొండ జాతరకు కొత్తపల్లి ఎడ్ల రథాలు!

భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం నుంచి గత 60 ఏళ్లుగా కొత్తకొండ జాతరకు రథాలు బయల్దేరడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది సుమారు 80 ఎడ్ల బండ్లతో రథయాత్ర సాగుతుంది. కొత్తపల్లి నుంచి కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతాయి. ఈ సంప్రదాయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Similar News
News February 14, 2026
ఏపీ పోలీస్ శాఖకు బడ్జెట్‌లో వరాలు

* కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు రూ.20 లక్షలు-రూ.45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పునరుద్ధరణ.
* టీఏ, డీఏలు, సెలవు బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం రూ.500 కోట్లు.
* పోలీస్ శాఖకు త్వరలోనే 3,000 కొత్త వాహనాలు.
* ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు.
* 94 ఎకరాల్లో కొత్త పోలీస్ అకాడమీ ఏర్పాటుకు రూ.15 కోట్లు.
News February 14, 2026
సంగారెడ్డి: తల్లీ.. కొడుకు.. కోడలు కౌన్సిలర్లు

సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకే కుటుంబం అరుదైన రికార్డు సృష్టించింది. నాల్సాబ్ గడ్డ ప్రాంతంలోని 24వ వార్డు నుంచి ఉల్ఫత్ సుల్తానా, 25వ వార్డు నుంచి అయేషా సుల్తానా, 26వ వార్డు నుంచి షేక్ షఫీ అహ్మద్‌లు కౌన్సిలర్లుగా గెలుపొందారు. గెలిచిన వారిలో తల్లీ, కొడుకు, కోడలు ఉండటం విశేషం. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
News February 14, 2026
అనకాపల్లి: ఢీకొన్న బైక్‌లు.. వ్యక్తి మృతి

సబ్బవరం మండలం మర్రిపాలెం జంక్షన్ వద్ద శనివారం రెండు బైకులు ఢీకొని తుంపాల కోటి(56) అనే వ్యక్తి అక్కడక్కడ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు కే.కోటపాడు నుంచి వస్తున్న బైకు ఢీకొనగా మృతి చెందినట్లు తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వడంతో పోలీసులు మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్ తరలించారు. మృతి చెందిన వ్యక్తి మర్రిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.


