News January 15, 2026

విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Similar News

News February 12, 2026

విశాఖ: ఫ్లైట్స్ షెడ్యూల్స్‌లో మార్పులు చూసుకున్నారా..!

image

విశాఖలో ఫిబ్రవరి 15-19 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026 నౌకాదళ విన్యాసాల నేపథ్యంలో విమానాశ్రయంలో షెడ్యూల్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సవరించింది. రోజూ ఉదయం 10.45-12.30, సాయంత్రం 4-5.30, 6.30-7.30 మధ్య వైమానిక మార్గం తాత్కాలికంగా మూసివేయనున్నారు. 16 విమానాల రాకపోకలు మారాయి. చెన్నై-విశాఖ-చెన్నై 6E581, 6E881 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.

News February 12, 2026

విశాఖలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

విశాఖపట్నం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ జి.విలియమ్స్ సాప్ (SAAP) లీగ్స్ జిల్లా స్థాయి ఎంపికల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో చదరంగం, 24న బీచ్ రోడ్డులో సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో సాప్ (SAAP) అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు.

News February 12, 2026

విశాఖలో మురికివాడల అభివృద్ధే లక్ష్యం

image

విశాఖలో మురికివాడల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో మెరుగైన ర్యాంక్ లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. RKబీచ్-రుషికొండ వరకు 6 సులభ్ కాంప్లెక్స్‌లు.. వెలంపేట, ఇందిరానగర్‌లో పైలట్ ప్రాజెక్టుల కింద గృహ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.