News January 15, 2026

U19 WC: USAపై భారత్ విజయం

image

U19 వన్డే WCలో USAతో మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత USA 107 పరుగులకు ఆలౌటైంది. తర్వాత భారత్ ఛేజింగ్ చేస్తుండగా వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులకు కుదించారు. IND 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఆయుష్ 19, వైభవ్ 2 పరుగులు చేయగా అభిజ్ఞాన్ (42) నాటౌట్‌గా నిలిచారు. 5 వికెట్లు తీసిన హెనిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Similar News

News February 5, 2026

సౌరశక్తితో గుంటూరులో 772 గిరిజన గృహాలకు వెలుగు

image

విద్యుత్‌ లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా సరఫరా అందిస్తుందని లోక్‌సభలో వెల్లడైంది. RDSS, PM-JANMAN పథకాల కింద రాష్ట్రంలో వేలాది ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. కాగా గుంటూరు జిల్లాలో PM-JANMAN కింద 772 PVTG కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. సౌర వీధి దీపాలు, ఆఫ్‌గ్రిడ్‌ సౌర వ్యవస్థల ఏర్పాటుతో గిరిజన ప్రాంతాలకు లబ్ధి చేకూరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

News February 5, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

image

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 5, 2026

లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్: తేజస్వీ

image

AP: టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు నివాసంలో పలు పార్టీల యువ ఎంపీలు, మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని BJP MP తేజస్వీ సూర్య Xలో పోస్ట్ చేశారు. ‘భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు యువ నేతలు చేయాల్సింది చాలా ఉంది. APలో లోకేశ్ పాలన పద్దతుల గురించి తెలుసుకోవడమే కాకుండా తరచూ ఇలా కలుసుకోవాలని నిర్ణయించాం. సుసంపన్న ఏపీ కోసం కృషి చేస్తున్న లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్’ అని పేర్కొన్నారు.