News April 25, 2024

ప్చ్.. శాంసన్‌కు మరోసారి మొండిచేయి?

image

టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో వికెట్ కీపర్‌గా కెఎల్.రాహుల్‌ను తీసుకునేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే పలు WCలు మిస్సైన సంజూ.. మరో WC వరకు ఎదురుచూడక తప్పదు. వారం రోజుల్లో జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో సంజూ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Similar News

News February 4, 2026

ఇండియన్ ఆర్మీలో JAG ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఇండియన్ <<>>ఆర్మీ JAG(జడ్జీ అడ్వకేట్ జనరల్ బ్రాంచ్)ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనుంది. LLB అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 27వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. CLAT PG-2025, షార్ట్ లిస్టింగ్, SSB, PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 49వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారు. వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in

News February 4, 2026

ఘోస్ట్ జాబ్స్ గురించి తెలుసా?

image

కొన్ని కంపెనీలు కావాలనే లేని జాబ్ ఆఫర్స్‌ను జాబ్ పోర్టల్స్‌లో పోస్ట్ చేస్తుంటాయి. వీటినే ఘోస్ట్ జాబ్స్ అంటారు. వీటికి అప్లై చేసుకుంటే స్పందన కోసం నెలల కొద్దీ వేచి చూడాలి. కంపెనీ యాక్టివ్‌గా ఉందని, గ్రో అవుతోందని ఇన్వెస్టర్లకు, క్లయింట్లకు చూపించడానికి, అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో అవుతుంటాయి. అయితే ఇవి దీర్ఘకాలంలో కంపెనీలు, ఉద్యోగార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

News February 4, 2026

బ్యాంక్ లాకర్ తీసుకుంటున్నారా? ఈ రూల్స్ తెలుసా..

image

చాలామంది నగలు, పత్రాల కోసం బ్యాంక్ లాకర్లను నమ్ముకుంటారు. లాకర్ అంటే కేవలం భద్రత మాత్రమే. ఇన్సూరెన్స్ కాదు. ఒకవేళ బ్యాంకు నిర్లక్ష్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే యాన్యువల్ ఫీజుకు 100 రెట్లు మాత్రమే పరిహారం దక్కుతుంది. ఇందులో క్యాష్, అక్రమ వస్తువులు పెట్టొద్దు. నామినీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. జాయింట్ లాకర్ అయితే ఆపరేటింగ్ మోడ్ సరిచూసుకోవాలి. సిటీల్లో లాకర్ల కోసం వెయిటింగ్ లిస్ట్ ఉండొచ్చు.