News January 16, 2026
కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత!

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అడ్డుకోబోయిన పోలీసులపై యువకుడు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. పోలీసులు, భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2026
నిర్భయలా మరణించి ఉంటే నమ్మేవారేమో.. ఉన్నావ్ రేప్ బాధితురాలు

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు కుల్దీప్ సెంగార్ (ఫొటోలో)కు సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించడంపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈ కేసులో 3నెలల్లో వాదనలు పూర్తి చేయాలని జడ్జి ఆదేశించడం సంతృప్తినిచ్చింది. నిందితుడి సోదరుల చేతిలో మరణించిన నా తండ్రి తిరిగి రాలేడు. నాపై జరిగిన రేప్ కేసులో న్యాయం కోసం 8ఏళ్లుగా పోరాడుతున్నా. బహుశా నిర్భయ లాగా మరణించి ఉంటే నమ్మేవారేమో’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 10, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా ర్యాంకింగ్‌లో “ఒంగోలు” టాప్

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియోజకవర్గాల ర్యాంకుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు (86%) అగ్రస్థానంలో నిలిచింది. కొండపి (84%), దర్శి (82%), అద్దంకి (81%), పర్చూరు (80%), చీరాల (79%) నియోజకవర్గాలు మెరుగైన ‘A’ గ్రేడ్ సాధించాయి. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు 77 శాతానికి పైగా మార్కులు పొందగా.. సంతనూతలపాడు, యర్రగొండపాలెం 75 శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి.
News February 10, 2026
మార్చి 15 లోపు పనులు పూర్తి: చిత్తూరు కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అందిన నిధులను మార్చి 15లోగా వినియోగిస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి జీఎస్టీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047విజన్ లక్ష్యంలో భాగంగా 10సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈసమావేశంలో కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంతో ఎస్పీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.


