News January 16, 2026

TU: ‘వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్’.. ఇంకా 5 రోజులే గడువు

image

టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ‘వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్’ ఫీజు చెల్లింపుకు ఇంకా 5రోజులే గడువుందని టీయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016-2020 మధ్య చేరిన బి.ఏ, బి.కామ్, బి.ఎస్సీ, బి.బి.ఏ విద్యార్థులు తమ పెండింగ్ సెమిస్టర్ల (1 నుంచి 6 వరకు) పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుంతో ఈనెల 27 వరకు అవకాశం ఉందన్నారు. ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News February 3, 2026

98.42% రూ.2వేల నోట్లు వెనక్కి వచ్చాయి: RBI

image

రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై RBI కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 98.42 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు RBI 2023 మే-19న ప్రకటించింది. అప్పుడు ప్రజల వద్ద రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లుండగా.. ఈ జనవరి 31 నాటికి అవి రూ.5,609 కోట్లకు చేరుకున్నాయి. ప్రజల వద్ద రూ.2 వేల నోట్లుంటే RBI కార్యాలయాల్లో డిపాజిట్ లేదా మార్చుకోవచ్చని సూచించింది.

News February 3, 2026

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ విజేత నొదిర్‌బెక్‌

image

ఉజ్బెకిస్థాన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ నొదిర్‌బెక్‌ అబ్దుసతారోవ్‌ ప్రతిష్ఠాత్మక ‘టాటా స్టీల్‌ మాస్టర్స్‌’ చెస్‌ టైటిల్‌ను గెలుచుకున్నారు. నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశీని 13వ రౌండ్‌లో ఓడించి.. 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఈ మెగా టోర్నీని సొంతం చేసుకున్నారు. భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్‌ 6.5 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచారు.

News February 3, 2026

రంగారెడ్డి: బీ ఫాం అంటే ఏంటో తెలుసా..?

image

ఎన్నికల్లో అభ్యర్థులు బీ ఫాం పొంది పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే బీ ఫాం లేకుండా పోటీచేస్తే ఎన్నికల అధికారులు వారిని ఇండిపెండెంట్లుగా పరిగణిస్తారు. అయితే బీఫాం అంటే ఏంటో చాలామందికి తెలియదు. బీ ఫాం అంటే గుర్తింపు పొందిన పార్టీలు అభ్యర్థులను తమ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబెడుతున్నట్లు ప్రతిపాదిస్తూ అధికారికంగా ప్రకటించడం. పార్టీ అధ్యక్షుడు లేదా పరిశీలకుడు సదరు అభ్యర్థిని ఎంపిక చేసి బీ ఫాం అందజేస్తారు.