News April 25, 2024
ఆ హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్

షూటింగ్‌లో భాగంగా తన అభిమాన హీరో షాహిద్ కపూర్‌ను కొట్టాలంటే భయమేసిందని స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘‘జెర్సీ’లో షాహిద్‌తో కలిసి నటించా. నేను ఆయనకు వీరాభిమానిని. తొలి రోజు షూట్‌లో ఆయననే చూస్తూ ఉండిపోయా. షూట్‌లో భాగంగా షాహిద్‌ను కొట్టాల్సి ఉంది. కానీ కొట్టలేకపోయా. మీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తు చేసుకుని నన్ను కొట్టండి అని షాహిద్ చెప్పారు. ఎలాగోలా ఆ సీన్ కంప్లీట్ చేశాం’ అని ఆమె చెప్పారు.
Similar News
News January 28, 2026
NeGDలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ e గవర్నెన్స్ డివిజన్(<
News January 28, 2026
IVF ప్రక్రియలో దశలివే..

IVFలో 5 కీలక దశలు ఉంటాయి. ఎగ్ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి.. బ్లడ్ టెస్ట్ చేయడానికి 9-14 రోజులు పడుతుంది, ఆ తర్వాత.. పిండం బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్ కోసం 17- 20 రోజుల సమయం పడుతుంది. అయితే, పేషెంట్ కండీషన్ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.
News January 28, 2026
భీష్మ ఏకాదశి ఎందుకు జరుపుకొంటారు?

మాఘ శుక్ల ఏకాదశి నాడే భీష్ముడు అంపశయ్యపై ఉండి, కృష్ణుని సమక్షంలో విష్ణు సహస్రనామాలు లోకానికి అందించి మోక్షం పొందారు. తన తండ్రి ద్వారా పొందిన ‘ఇచ్ఛా మృత్యువు’ వరంతో ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి, ఈ పవిత్ర తిథి నాడు ప్రాణాలు విడిచారు. అందుకే ఈరోజుని ‘భీష్మ ఏకాదశి’గా జరుపుకొంటారు. దీన్నే ‘జయ ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్మకం.


