News January 16, 2026

కనుమ రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

image

కనుమ నాడు పశువుల దైవమైన కాటమరాజుని, సకల దేవతా స్వరూపమైన కామధేనువును భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరి పొలిమేరల్లో మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి, వాటికి దిష్టి తీసి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. పిండివంటల తర్వాత కనుమ నాటి మాంసాహార విందులతో పండుగ సందడి ముగుస్తుంది.

Similar News

News March 16, 2026

గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

image

LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో బుకింగ్ & డెలివరీ సమయంలో ఆటంకాలు రావొద్దంటే వెంటనే eKYC పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. సబ్సిడీ ఆగిపోకుండా, కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇది తప్పనిసరని పేర్కొంది. దీనికోసం1800 233 3555 నంబర్‌కు లేదా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. లేకపోతే మీ ఆయిల్ కంపెనీ యాప్‌ డౌన్‌లోడ్ చేసి ‘Aadhaar FaceRD’ యాప్‌ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చు. SHARE IT

News March 16, 2026

నేడే రాజ్యసభ ఎన్నికలు.. బరిలో నితీశ్ కుమార్

image

రాజ్యసభలో 37 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. TG(2 స్థానాలు)తో పాటు బెంగాల్, అస్సాం, బిహార్, TN, MH, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హరియాణా, HPలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 26 స్థానాలు ఏకగ్రీవం కానుండగా 11 సీట్ల కోసం పోలింగ్ నిర్వహిస్తారు. బిహార్ CM నితీశ్ కుమార్, BJP జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. MPగా ఎన్నికయ్యాక CM పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశముంది.

News March 16, 2026

జూన్‌లో 2 ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన?

image

TG: వరంగల్(D) మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి జూన్‌లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమానికి PM మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మామునూరుకు రూ.850 కోట్లు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు రూ.1,061 కోట్లు అవసరమని అంచనా. ఇక్కడ పౌర, మిలిటరీ విమానాలు ల్యాండయ్యేలా రన్‌వేను నిర్మించనున్నారు. అలాగే డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తారని సమాచారం.