News January 16, 2026
నేడు ఫిరాయింపు MLAల కేసు విచారణ

TG: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసును జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం విచారించనుంది. 2023 ఎన్నికల్లో గెలిచిన 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరినట్లు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే <<18864508>>నిర్ణయం<<>> తీసుకున్నారు. ఈ విషయాన్ని 3 నెలల్లో తేల్చాలంటూ గతంలో సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.
Similar News
News March 31, 2026
రేపటి నుంచి ఇంటర్ క్లాసులు

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ.12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే.
News March 31, 2026
ఏప్రిల్ 2న ‘రామాయణ’ పాత్రల ఫస్ట్ లుక్?

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణ’లోని పాత్రల ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 2న మూవీ టీమ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. హనుమాన్ జయంతి సందర్భంగా పాత్రల లుక్స్‌పై స్పెషల్ గ్లింప్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
News March 31, 2026
మార్చి 31: చరిత్రలో ఈరోజు

★ 1861: లోకోమొబైల్ (స్టీమ్‌తో నడిచే కారు)లో ప్రపంచాన్ని చుట్టేసిన తొలి మహిళ హ్యారియెట్ వైట్ ఫిషర్ జననం
★ 1865: పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన తొలి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి జననం (ఫొటోలో)
★ 1928: సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి జననం
★ 1987: చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ జననం
★ 1727: భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం
★ ప్రపంచ బ్యాకప్ డే


