News January 16, 2026

హైదరాబాద్‌లో AQ @222

image

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున గాజులరామరంలో 222కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.

Similar News

News March 29, 2026

KKR విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 పరుగులు

image

MIతో జరుగుతున్న మ్యాచులో KKR ఓపెనర్లు రహానే, అలెన్ విరుచుకుపడుతున్నారు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 26 రన్స్ బాదారు. తొలుత రహానే 2 సిక్సులు కొట్టగా, అలెన్(37) 3 ఫోర్లు బాదారు. ఒక వైడ్, లెగ్ బైస్ ద్వారా పెద్ద ఓవర్‌గా మారింది. దీంతో 4 ఓవర్లు ముగిసే లోపే జట్టు స్కోర్ 50 పరుగులు దాటింది. MIపై KKRకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.

News March 29, 2026

వరదలు ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు: పోలవరం కలెక్టర్

image

వరదలు ఎదుర్కొనే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్ ఆదివారం అన్నారు. చింతూరు ఐటీడీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు వరదల సమయంలో ప్రజలకు మూడు నెలల రేషన్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకున్నారు.

News March 29, 2026

మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమీక్ష

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. అసెంబ్లీ కమిటీ హాలులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్ నిధులు, ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇరిగేషన్, టూరిజమ్ అధికారులు పాల్గొన్నారు.