News January 16, 2026

HYD: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇంటికే!

image

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై RTA కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొత్త సాఫ్ట్‌వేర్ అమలుకు HYD యంత్రాంగం కసరత్తు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. వాహనదారుడు షోరూమ్‌లోనే డీలర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డైరెక్ట్‌గా పోస్టు ద్వారా ఇంటికే చేరుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజలకు సమయం, శ్రమ ఆదా చేసే విధానమని తెలిపారు.

Similar News

News February 5, 2026

జాబ్ క్యాలెండర్ కాదు స్కామ్ క్యాలెండర్: హరీశ్

image

TG: సీఎం రేవంత్ గతేడాది ప్రతినెలా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, నెలకు ఒక స్కామ్ చేశారని హరీశ్ రావు విమర్శించారు. జనవరిలో సివిల్ సప్లైస్, FEBలో ఎన్టీపీసీ ఫ్లై యాష్, మార్చిలో సాండ్, APRలో ఆర్టీసీ, మేలో అమృత్ టెండర్లు, జూన్‌లో ఫోర్త్ సిటీ, జులైలో లగచర్ల ల్యాండ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు, సెప్టెంబర్‌లో HILTP, అక్టోబర్‌లో విద్యుత్, NOVలో సింగరేణి, డిసెంబర్‌లో KLSR స్కామ్ చేశారని ఆరోపించారు.

News February 5, 2026

సమన్వయంతో పనిచేయండి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో GST ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో కమర్షియల్ టాక్స్ శాఖతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో TDS నిబంధనలు పాటించాలన్నారు.

News February 5, 2026

చిన్నారులపై నిరంతర పర్యవేక్షణ అవసరం: పెద్దపల్లి కలెక్టర్

image

పిల్లల ఎదుగుదలను నిరంతరం మానిటర్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు నిబంధనల ప్రకారం పనిచేయాలని, పిల్లల ఎదుగుదల, గర్భిణీలు, బాలింతలకు అందించే పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని 90 అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు ₹2 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.