News January 16, 2026
GNT: డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు జాక్‌పాట్

17626 డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పడిన సాంకేతిక, అంతర్గత సమస్యల నేపథ్యంలో S10, S11 స్లీపర్ కోచ్‌ల ప్రయాణికులను రైల్వే అధికారులు ఉచితంగా 3rd AC కోచ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండానే ఈ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రయాణంలో ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది సమర్థంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రోజున లభించిన ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు “జాక్‌పాట్”గా అభివర్ణిస్తున్నారు.
Similar News
News January 28, 2026
GNT: ‘చంద్రబాబు రాక..వైసీపీ నిరసన వాయిదా!

అంజుమన్ ఆస్థుల అన్యాక్రంతంపై వైసీపీ ఈ నెల 30న నిర్వహించనున్న నిరసన ర్యాలీ వాయిదా వేసినట్లు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా తెలిపారు. 30న CMచంద్రబాబు GGHలో నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 144సెక్షన్ అమలులో ఉంటుంది. దీంతో నగరంపాలెం ఈద్గా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించనున్న ర్యాలీని ఫిబ్రవరి 6వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు.
News January 28, 2026
GNT: కాల్పుల కేసు కొట్టివేత.. 13 మంది నిందితుల విడుదల

2010 జులై 5వ తేదీన ఆర్ అండ్ బి బంగ్లాలో జరిగిన పాలపాటి సత్యనారాయణ @ సత్యం (52) హత్య కేసు కొట్టివేస్తూ గుంటూరు రెండవ అదనపు జిల్లా జడ్జి నాగరాజ బుధవారం తీర్పు చెప్పారు. 113 తాళ్లూరుకి చెందిన సత్యంకు, చిలకలూరిపేటకు చెందిన మల్లెల సత్యనారాయణతో కుటుంబ వివాదం ఉంది. దానిని పరిష్కరించుకునే క్రమంలో ఐబికి వచ్చిన సత్యంపై మల్లెల అనుచరులు కాల్పులు జరిపి హతమార్చారని సీఐడీ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు.
News January 28, 2026
గుంటూరు జోన్‌లో 23 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ

గుంటూరు జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 23 ఫార్మసీ అధికారి (ఫార్మసిస్ట్ గ్రేడ్–II) పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకాలు చేపట్టనుంది. దరఖాస్తులను జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు ఆర్‌డీఎంహెచ్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు పేర్కొంది.


