News January 16, 2026

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

image

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Similar News

News February 3, 2026

Trade Deal: ఇండియాలో కామన్ మ్యాన్‌కు ఏంటి?

image

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత్‌లో సామాన్యుల జీవితాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, జెమ్స్-జువెలరీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చమురు, గ్యాస్ దిగుమతులు చౌకగా మారితే ఇంధన ధరలు తగ్గొచ్చు. రూపాయి బలపడి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. వ్యవసాయ రంగంపై క్లారిటీ రావాల్సి ఉంది.

News February 3, 2026

HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

image

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ 12-45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గర్భం దాల్చకముందే దీన్ని తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా చేస్తుంది. 9- 17 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.

News February 3, 2026

ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలి: ఎస్పీ స్నేహ మెహ్ర

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్ర వెల్లడించారు. ఆన్‌లైన్ ఓరియంటేషన్, ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బందికి పలు సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.