News January 16, 2026
నిర్మల్: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణానికి 1176 ఎకరాల సేకరణ

సదర్మాట్ బ్యారేజీ ద్వారా ఉమ్మడి ADB, NZB, KNR జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది. 1.58 TMCల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం 1176 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో NRML జిల్లాలో 805, JGTL జిల్లాలో 317 ఎకరాలు ఉన్నాయి. ఈ బ్యారేజీ ద్వారా 13,210 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, JGTL జిల్లాలోని 4,896 ఎకరాలకు నీరు అందుతుంది. బ్యాక్ వాటర్ ద్వారా NZB జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కలగనుంది.
Similar News
News January 27, 2026
పీఎం ఆదర్శ గ్రామ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెదఅమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 144 పనుల్లో కేవలం 27 మాత్రమే పూర్తయ్యాయన్నారు. పురోగతిలో ఉన్న 63 పనులతో పాటు, ప్రారంభించాల్సిన 54 పనులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే ముగించాలని స్పష్టం చేశారు.
News January 27, 2026
మంచిర్యాల: హత్యాయత్నం కేసులో జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో నిందితుడికి 3సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మంచిర్యాల సీనియర్ సివిల్ జడ్జి నిర్మల విధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మందమర్రి పెట్రోల్ బంకు సమీపంలో డబ్బుల లావాదేవీల విషయంలో జరిగిన గొడవల్లో కుమారస్వామి చంపాలనే ఉద్దేశంతో కత్తితో దాడి చేయగా బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి ఎస్సై సతీశ్ కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష ఖరారు చేశారు.
News January 27, 2026
రేపటి నుంచే నామినేషన్లు

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న మొత్తం 141 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్లకు కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అభ్యర్థులు తమ అనుబంధ పత్రాలు, మున్సిపాలిటీ సర్టిఫికెట్లు, ఇతర ఫారాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.


