News April 25, 2024

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాంట్‌కు చెందిన ఆస్తులు, భూములను యథాతథంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేఏ పాల్, వీవీ లక్ష్మీనారాయణ పిటిషన్‌లపై హైకోర్టు విచారించింది. ప్లాంట్‌కు సంబంధించిన ఎలాంటి ఆస్తులు విక్రయించమని ఏఎస్‌జీ నరసింహ శర్మ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది.

Similar News

News January 29, 2026

కుసుమలో ఆకుమచ్చ తెగులు-నివారణకు సూచనలు

image

ప్రస్తుతం పెరిగిన మంచు తీవ్రత, వాతావరణంలో 70 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు కుసుమ పంటలో ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆకులపై గోధుమ రంగు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను గమనిస్తే లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి తొలిసారి పిచికారీ చేయాలి. మళ్లీ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండోసారి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 29, 2026

కొలంబోకి టికెట్లు బుక్ చేసుకున్న పాకిస్థాన్!

image

WC కోసం కొలంబో(SL)కు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ కొలంబో వెళ్తోందని ‘టెలికమ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. తమ రిక్వెస్ట్‌కు ICC నో చెప్పడంతో బంగ్లా WC నుంచి వైదొలిగింది. దానికి మద్దతుగా తాము కూడా బాయ్‌కాట్ చేసే విషయాన్ని ఆలోచిస్తామని పాక్ చెప్పింది. అయితే తమ పార్టిసిపేషన్‌పై సోమవారం PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

News January 29, 2026

లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్

image

ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిలిచ్చింది. రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.