News January 16, 2026

BREAKING: నల్గొండలో మర్డర్

image

నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకొని రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లికి చెందిన చంద్రుగా గుర్తించారు. రైల్వే పనుల నిమిత్తం నల్గొండకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. 2వ టౌన్ ఎస్‌ఐ ఎర్ర సైదులు దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News January 29, 2026

శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు: ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. బందోబస్తు, బారికేడ్లను తనిఖీ చేసిన ఆయన, సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయబడుతుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News January 29, 2026

KMR: నామిషన్లలో అభ్యర్థులు ఫుల్ బిజీ.. ప్రచారానికి బ్రేక్..!

image

కామారెడ్డి జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు విషయంలో బిజీగా ఉండటంతో ప్రచార పర్వానికి బ్రేక్ పడింది. మున్సిపల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల, ప్రతిపాదిత వ్యక్తుల నో డ్యూ సర్టిఫికెట్ల కోసం బారులు తీరడంతో సమయానికి సంబంధిత పత్రాలు పొందడానికి అక్కడే సమయం పట్టడంతో ప్రచారానికి బ్రేక్ వేశారు. రేపటిలోగా నామినేషన్లు దాఖలు చేసి వార్డుల్లో ప్రచారం చేయనున్నారు.

News January 29, 2026

VKB ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది: CP సజ్జనార్

image

వికారాబాద్‌లో ప్రియుడి కోసం కన్న వారిని చంపిన ఘటనపై CP సజ్జనార్ స్పందించారు. వేలు పట్టి నడిపించిన నాన్న, గోరు ముద్దలు తినిపించిన అమ్మ చేతిలో విగతజీవులుగా మారడం విషాదకరమన్నారు. ఊపిరి పోసిన వారి ఊపిరినే తీయాలనుకోవడం దారుణమని తెలిపారు. పేగు బంధాన్ని కడతేర్చడం సమాజాన్ని తలదించుకునేలా చేసిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు, ఓ ఎమోషన్ అని వివరించారు.