News January 16, 2026

నల్గొండలో నాగర్ కర్నూల్ జిల్లా వాసి హత్య

image

నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లికి చెందిన చంద్రును హత్యకు గురయ్యాడు. రైల్వే పనుల నిమిత్తం నల్గొండ జిల్లాకు వెళ్లిన చంద్రుకు, అక్కడ పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న నల్గొండ 2వ టౌన్ ఎస్‌ఐ ఎర్ర సైదులు దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News February 8, 2026

నిస్సారమవుతున్న నేలలు.. పెరుగుతున్న ముప్పు

image

దేశవ్యాప్తంగా నేలల ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని ICRIER హెచ్చరించింది. ‘హీలింగ్‌ సాయిల్స్‌ ఇన్‌ ఇండియా’ నివేదిక ప్రకారం సల్ఫర్‌, జింక్‌, ఇనుము వంటి సూక్ష్మపోషకాల లోపం ఏటా పెరుగుతోంది. సాగు భూముల్లో సగానికి పైగా సేంద్రియ కర్బనం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఉత్పత్తి పెరుగుతున్నా ఆహారంలోని పోషకాలు తగ్గుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో TG, AP టాప్‌-10లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

News February 8, 2026

పాపికొండల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి

image

జిల్లాలో మంజూరైన రోడ్లను మే నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి మనోహర్ శనివారం అధికారులను ఆదేశించారు. దెందులూరులో 150 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధమైందని వెల్లడించారు. పాపికొండల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ రిసార్టులు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరో 60 యూనిట్లు రానున్నాయని తెలిపారు.

News February 8, 2026

శేష వాహన సేవలో మన్యంకొండ శ్రీవారు

image

మన్యంకొండ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత విశేషమైన శేష వాహన సేవ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాత్రి 9 గంటల తర్వాత ఆదిశేషునిపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శేష వాహన సేవను దర్శించడం వల్ల పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.