News January 16, 2026

ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

image

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.

Similar News

News February 7, 2026

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు: హరీశ్

image

TG: పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా సీఎం రేవంత్ ప్రజలను మోసం చేశారని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి చెక్కుల ఊసే లేదన్నారు. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన అన్ని స్కీములను ఆయన రద్దు చేశారు. ఇక కమలం గుర్తుకు ఓటేయడం అంటే మోరీలో వేయడమే’ అని ఫైరయ్యారు.

News February 7, 2026

కుంభ సంక్రమణం ప్రత్యేక పూజ

image

ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడి అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? అయితే కుంభ సంక్రమణం రోజున నిర్వహించే పవిత్ర ఆదిత్య హృదయ పారాయణం మీకు సరైంది. దీంతో విజయప్రాప్తి కలగడమే కాకుండా శరీర బలం, తేజస్సు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అడ్డంకులు తొలగి, పనుల్లో విజయం లభిస్తుంది. సూర్యుడి ఆవాహనతో చేసే పూజ పూర్తి రికార్డింగ్‌ను వాట్సాప్‌లో పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో వేద మందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.

News February 7, 2026

బంధం విఫలం అవ్వడం మీ తప్పు కాదు

image

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ తప్పుల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.