News January 16, 2026

పార్లమెంట్‌లో ‘జై పాల్’మూరు

image

MBNR జిల్లా మాడ్గులలో జన్మించిన జైపాల్ రెడ్డి, ఉస్మానియాలో చదివే రోజుల్లోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే పోలియో బారిన పడినా తన మేధోశక్తితో దాన్ని అధిగమించారు. 1969లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరో 3సార్లు MLAగా, 5 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. కేంద్రంలో అనేక మంత్రి పదవులకు వన్నె తెచ్చారు. # నేడు ఆయన జయంతి.

Similar News

News March 10, 2026

నంద్యాల: ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలు

image

నంద్యాల జిల్లాలోని 20 ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో పాఠశాలలో 100 సీట్ల చొప్పున జిల్లా వ్యాప్తంగా 2,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న నిర్వహించే ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

News March 10, 2026

అనంత: ఉద్యోగుల సీనియారిటీ లిస్టులో తప్పులు..!

image

స్వర్ణ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ లిస్ట్‌లో తప్పులు ఉన్నట్లు రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాయలసీమ అధ్యక్షుడు ఆదినారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో PGRS కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు వారు వినతి ఇచ్చారు. సీనియార్టీ లిస్టును సరిదిద్ది రిజర్వేషన్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు.

News March 10, 2026

విశాఖలో నేడు అంతర్జాతీయ నీటి భద్రతా సదస్సు

image

విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ (VER) నీటి భద్రత ప్రణాళికపై మంగళవారం నోవాటెల్ హోటల్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో సింగపూర్, ఆస్ట్రేలియా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెరుగుతున్న నీటి అవసరాలు, వనరుల సమర్థ వినియోగం, అంతర్జాతీయ నిర్వహణ పద్ధతులపై నిపుణులు చర్చించనున్నారని అధికారులు పేర్కొన్నారు.